లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!

life insurance maturity money will not be fully tax exempt CBDT new tax rules - Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

2023 ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్‌ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top