Lenovo Tab K10 Mobile Launched In India - Sakshi
Sakshi News home page

Lenovo: లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్‌..! భారీ తగ్గింపుతో లాంచ్‌..!

Oct 25 2021 4:06 PM | Updated on Oct 25 2021 5:25 PM

Lenovo Tab K10 Launched In India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ కె10మోడల్‌ను సోమవారం రోజున కంపెనీ విడుదల చేయగా...ఈ ట్యాబ్‌కు 7500ఎమ్‌ఎహెచ్‌ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్‌ వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లెనోవో లాంచ్‌ చేసిన ట్యాబ్‌ కే 10 ధర కంపెనీ వెబ్‌సైట్‌ లో రూ. 25000గా ఉండగా...ఫెస్టివల్‌ సీజన్‌ నేపథ్యంలో అతి తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.

4జీబీ+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర   రూ. 16,999, కాగా 3జీబీ+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999 గా ఉంది. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్‌ 11 వోఎస్‌ను సపోర్ట్‌ చేయనుంది. అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్‌ 12 వోఎస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చునని లెనోవో పేర్కొంది. 
చదవండి: జియో ఫోన్‌ సేల్స్‌ కోసం అదిరిపోయే బిజినెస్‌ మోడల్‌

లెనోవో ట్యాబ్‌ కే10 ఫీచర్స్‌

  • ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌
  • 10.3-అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ (1,920x1,200 పిక్సెల్స్‌) టీడీడీఐ డిస్‌ప్లే
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22టీ ప్రాసెసర్‌
  • లెనోవో యాక్టివ్‌ పెన్‌ సపోర్ట్‌
  • పవర్‌వీఆర్‌ జీఈ 8320 గ్రాఫిక్స్‌ ప్రసెసింగ్‌ యూనిట్‌
  •  4 జిబి ఎల్‌పిడిడిఆర్
  • 4జీబీ+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 8ఎమ్‌పీ రియర్‌ కెమెరా
  • 5ఎమ్‌పీ ఫ్రంట్‌ కెమెరా
  •  డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్పీకర్‌
  • USB టైప్-C పోర్ట్ 
  • ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌
  • 10W ఛార్జింగ్ సపోర్ట్‌
  • 7,500mAh బ్యాటరీ

చదవండి:  వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్‌ అప్‌డేట్‌..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement