టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఈ నెలలో మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి.
ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్‌లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్‌లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి.
ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్‌సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 FE (Samsung Galaxy S26 FE): ఎక్సినోస్ 2500 ప్రాసెసర్, 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI, 4,900mAh బ్యాటరీ.
పోకో F9 సిరీస్ (Poco F9 Pro, Ultra): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, గరిష్టంగా 185Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 8050mAh బ్యాటరీ.
వీవో X500 సిరీస్ (Vivo X500 Pro, Pro Max): జైస్ బ్రాండింగ్ కెమెరా సెటప్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2K మాస్టర్ కలర్ డిస్‌ప్లే, 4K 240fps స్లో-మోషన్ వీడియో రికార్డింగ్.
వీవో T5 5G (Vivo T5 5G): మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, 1.5K 144Hz 3D కర్వ్‌డ్ అమెలెడ్ డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా.
షావోమీ 18 ఫోల్డ్, 18 ప్రో (Xiaomi 18 Series): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్, షావోమీ సొంత Xring O3 చిప్‌సెట్, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్.
రెడ్‌మీ నోట్ 17 ప్రో సిరీస్ (Redmi Note 17 Pro, Pro Max): 6.83-అంగుళాల 1.5K 120Hz అమెలెడ్ డిస్‌ప్లే, ప్రో మాక్స్ వేరియంట్‌లో 10000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.
ఐకూ 16 (iQOO 16): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో, 185Hz రిఫ్రెష్ రేట్‌తో 2K LTPO అమెలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, 8500mAh బ్యాటరీ.
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G+: 6.76-అంగుళాల 144Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 7.85mm స్లిమ్ డిజైన్, బ్యాక్ ప్యానెల్‌పై ఇంటరాక్టివ్ ఆక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ లైటింగ్.
మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త ఆవిష్కరణలపై ఒక కన్నేసి ఉంచడం మంచిది. అయితే ఏదైనా కొనుగోలు నిర్ణయం తీసుకునేప్పుడు టెక్ నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోండి.
ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!


