Nokia N73: నోకియా పోరాటం.. అదరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌..

Leaked Details About Nokia Upcoming Smart Phone With Penta Camera setup - Sakshi

ఒకప్పుడు ఇండియాలో నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా వెలుగు వెలిగిన నోకియా కాలానుగుణంగా ఫీచర్లను జోడించకుండా వెనుకబడి పోయింది. ఆ తర్వాత తన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుంచి మార్కెట్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ క్రమంలో అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్‌ రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. 

ఎన్‌ సిరీస్‌లో
త్వరలో నోకియా మార్కెట్‌లోకి తేబోయే ఫోనుకు సంబంధించిన ఫీచర్లను చైనాకు చెందిన ప్రముఖ సంస్థ సీఎన్‌ఎమ్‌వో రిపోర్టు చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. 2006లో నోకియాలో సక్సెస్‌పుల్‌ మొబైల్‌గా ఎన్‌73 నిలిచింది. ఇందులో ఉపయోగించిన సింబియాన​ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని అందిచింది. అయితే ఆండ్రాయిడ్‌ హవాలో మిగిలిన ఫోన్లలానే నోకియా శకం కూడా క్రమంగా కొడగట్టిపోయింది. అయితే త్వరలో లాంచ్‌ చేయబోయే ఫోన్‌ను ఎన్‌ 73 సిరీస్‌లోనే రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం.

ఫీచర్లు
- నోకియా రాబోయే ఫోనులో ఐదు కెమరాలను వినియోగించనున్నారు. ఇందులో ఒక కెమెరాకు 200 మెగా పిక్సెల్‌ సామర్థ్యం అందివ్వనున్నారు. దీనికి శామ్‌సంగ్‌ ఐసోసెల్‌ హెచ్‌పీ వన్‌ సెన్సార్లు వినియోగించనున్నారు. వెనుక వైపు ఉండే ఐదు కెమెరాల్లో రెండు కెమరాలకు శక్తివంతమైన సెన్సార్లు ఉంటాయి. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ అందిస్తున్నారు.
- 2019లోనే నోకియా ఐదు కెమెరాల సెటప్‌తో ప్యూర్‌ వ్యూ అనే మోడల్‌ రిలీజ్‌ చేసినా.. అందులో సాఫ్ట్‌వేర్‌ ఇష్యూస్‌ రావడంతో ఆ మోడల్‌ పెద్దగా క్లిక్‌ కాలేదు. కానీ కెమెరాలకు మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. దీంతో ఈ సారి ఆ కెమెరా సెటప్‌ను మరింత సమర్థంగా అప్‌గ్రేడ్‌ చేశారు.
- డిస్‌ప్లేలో కర్వ్‌డ్‌ ఎడ్జ్‌ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

ఇకనైనా
ఇక రాబోయే ఫోన్‌ ఈ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తుంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సంగతేంటి, ధర ఎంత ఉండవచ్చనే అంశాలను అతి త్వరలోనే అందిస్తామని సీఎన్‌ఎంవో పేర్కొంది. కనీసం ఈ ఫోనుతో అయినా నోకియా మార్కెట్‌లో తన ఉనికి చాటుకోవాలని ఆ బ్రాండ్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 

చదవండి: ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు బంపరాఫర్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top