భారత్‌లో లాంచ్ అయిన ఇటాలియన్ సూపర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు

Lamborghini New Car Revuelto Details - Sakshi

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'రెవెల్టో' (Revuelto) కారుని లాంచ్ చేసింది. రూ.8.89 కోట్ల ధర వద్ద విడుదలైన ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ రెవెల్టో చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వై షేప్ హెడ్‌లైట్, ఎయిర్ ఇన్‌టేక్‌లు, టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో హెక్సా గోనల్ ఎగ్జాస్ట్ పోర్ట్‌లు చూడవచ్చు. ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉంటాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.4 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ డిస్‌ప్లే, 9.1 ఇంచెస్ ప్యాసింజర్-సైడ్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఈ మూడు స్క్రీన్‌లు ఫిజికల్ కంట్రోల్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా కంట్రోల్ బటన్స్ పొందుతుంది. సౌకర్యవంతమైన సీట్లు కలిగిన ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదీ చదవండి: షారుక్ ఖాన్‌ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?

లంబోర్ఘిని రెవెల్టో సూపర్ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్‌లతో 1015 హార్స్ పవర్, 807 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. ఇది ఇండియన్ మార్కెట్లో 'ఫెరారీ SF90 స్ట్రాడేల్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top