2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్: ధర ఎంతంటే? | 2026 Renault Duster Launched In India | Sakshi
Sakshi News home page

2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్: ధర ఎంతంటే?

Mar 17 2026 3:31 PM | Updated on Mar 17 2026 3:53 PM

2026 Renault Duster Launched In India

2026 గణతంత్ర దినోత్సవం రోజు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ కారు.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఐదు వేరియంట్లు, మూడు ఇంజిన్ ఎంపికలతో లభించే ఈ కారు.. ఆరు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రెనాల్ట్ కంపెనీ 2026 డస్టర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 2026 రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్‌లో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసి E-టెక్ 160 హైబ్రిడ్ సెటప్‌తో రూపొందించారు. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్‌ అందిస్తుంది.

160 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (టర్బో TCe 160) కూడా ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ రెండింటితోనూ అందుబాటులో ఉంది. బేస్ మోడల్‌ విషయానికి వస్తే.. ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

భద్రతకు సంబంధించిన ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ SUVకి లెవెల్ 2 ADAS కూడా లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement