జొమాటో గిన్నిస్ రికార్డ్.. సీఈఓపై మండిపడ్డ కునాల్ కమ్రా | Kunal Kamra Vs Zomato: Comedian Kunal Kamra Mocks Zomato CEO Deepinder Goyal Viral Tweet | Sakshi
Sakshi News home page

జొమాటో గిన్నిస్ రికార్డ్.. సీఈఓపై మండిపడ్డ కునాల్ కమ్రా

Published Fri, Jun 14 2024 2:02 PM | Last Updated on Fri, Jun 14 2024 2:36 PM

Kunal Kamra Mocks Zomato CEO Deepinder Goyal Viral Tweet

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల 'ఒకే వేదిక వద్ద అతిపెద్ద ఫస్ట్ ఎయిడ్ లెసన్' నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేశారు.

దీపిందర్ గోయల్ ట్వీట్ మీద హాస్యనటుడు 'కునాల్ కమ్రా' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జొమాటో సీఈఓ వారి డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం, వారి పని గంటల గురించి ప్రకటించగలరా?. కానీ ఒక రోజులో ఎన్ని కేజీల బిర్యానీ ఆర్డర్ చేశారో చెప్పగలరు  కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు.

జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌
జొమాటో కంపెనీ ఇటీవల తన 4300 మంది డెలివరీ భాగస్వాములకు ఒకే వేదిక మీద ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పించారు. జొమాటో డెలివరీ భాగస్వాములు ఇకపైన ప్రధమ చికిత్స సమయంలో కూడా సహాయం చేయగలరు.. భారతదేశంలోని ఈ ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్, పెద్ద థాంక్స్ అంటూ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు.

జొమాటో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లభించింది. ఇది పలువురు నెటిజన్లను ఎంతగానో ఆకర్శించింది. కొందరు దీపేందర్ గోయల్‌ను ప్రశంసించారు. ఇది అద్భుతమైన అచీవ్‌మెంట్.. డెలివరీ భాగస్వాములకు హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement