స్ట్రిప్డ్‌ ఫ్లై మాల్వేర్‌తో జాగ్రత్త

Kaspersky cautions against malware StripedFly - Sakshi

కాస్పర్‌స్కీ హెచ్చరిక

ఫుకెట్‌ (థాయిల్యాండ్‌): సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ.. స్ట్రిప్డ్‌ ఫ్లై అనే మాల్వేర్‌ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్‌ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్‌గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్‌ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్‌వేర్‌ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్‌స్కీ హెచ్చరించింది.

బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్‌ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ షాట్‌లు ఈ మాల్వేర్‌ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్‌ ఫ్లై మాల్వేర్‌ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం, అప్లికేషన్‌లు, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్‌ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్‌ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top