
జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్స్ సంస్థ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సంస్కరణలను డిమోన్ కొనియాడారు.
‘‘సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్‌లో ప్రధాని మోదీ 40 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. అక్కడ పలు రాష్ట్రాల్లోని పన్ను వ్యవస్థల సంక్లిష్టతలను ఛేదించి సంస్కరించారు. సానుకూల మార్పు దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’’ అంటూ మోదీని పొగిడారు.