అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్! | Jio Rs 189 Cheapest Recharge Get unlimited Calling and Data | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!

Apr 11 2026 2:58 PM | Updated on Apr 11 2026 3:23 PM

Jio Rs 189 Cheapest Recharge Get unlimited Calling and Data

మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.

రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలు
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.

50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్‌
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్‌ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement