Income Tax: ఐటీఆర్‌ ఫారం 2 రెడీగా ఉంది.. | ITR 2 form AY 2026-27 who should file eligibility deadline key changes | Sakshi
Sakshi News home page

Income Tax: ఐటీఆర్‌ ఫారం 2 రెడీగా ఉంది..

Jun 1 2026 10:31 AM | Updated on Jun 1 2026 7:42 PM

ITR 2 form AY 2026-27 who should file eligibility deadline key changes

గత వారం నుంచి ఆదాయపు పన్ను వారి ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లో ఫారాలను ఎనేబుల్‌ చేస్తున్నారు. మనం గతంలో ఫారం 1, ఫారం 4 గురించి తెలుసుకున్నాం. లేటెస్టుగా ఫారం 2 రెడీగా ఉంది. వివరాల్లోకి వెళ్దాం.

ఈ ఫారం ఎవరు దాఖలు చేయాలి? 
వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఐటీఆర్‌ ఫారం 2ను వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారం ద్వారా తమ ఆదాయాలను డిక్లేర్‌ చేయకూడదు. ఐటీఆర్‌ ఫారం 1 వేయకూడనివారు (వేయలేకపోవడం కాదు.. వేయడానికి అర్హత లేని వారు), అలాగే బిజినెస్‌ / వృత్తిపై లాభనష్టాలు ఉండని వారు మాత్రమే ఈ ఫారం దాఖలు చేయడానికి అర్హులు.

ఏయే ఆదాయాలున్నవారు వేయొచ్చు.. 
ß మూలధన లాభాలు (దీర్ఘకాలిక, స్వల్పకాలిక) 
ß ఒక ఇంటి ఆస్తి మీద, ఎక్కువ ఆస్తుల మీద ఆదాయం ఉన్నవారు 
ß విదేశీ ఆస్తుల మీద ఆదాయం  
ß విదేశాల నుంచి ఆదాయం 
ß జీతాలు / పెన్షన్‌ 
ß ఇతర ఆదాయాలు, లాటరీలు, గుర్రపు పందాలు, గ్యాంబ్లింగ్‌ వగైరా ఆదాయాలు ఉన్నవారు 
ß వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటినవారు 
ß మొత్తం ఆదాయం పరిమితి రూ. 50,00,000 దాటినవారు 
ß డైరెక్టర్స్‌ 
ß అన్‌లిస్టెడ్‌ ఈక్విటీ వాటాల్లో ఇన్వెస్ట్‌ చేసినవారు

ఏ ఆదాయం ఉన్నవారు వేయకూడదు.. 
వ్యక్తులు కానీ / హిందు ఉమ్మడి కుటుంబాలకు వ్యాపారం మీద / వృత్తి మీద ఆదాయం ఉన్నవారు ఫారం 2 వేయకూడదు.

గడువు తేదీ ఎప్పుడు 
ఈ ఫారం దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31.

తెలుసుకోవాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
ఈ ఫారం ఆన్‌లైన్‌లో గానీ ఆఫ్‌లైన్‌లో గానీ వేసుకోవచ్చు. ఈ కింద చెప్పబోయే విషయాల్లో పాత చట్టంలో పేర్కొన్న పేరు, ఫారాలను వాడుతున్నాం. 
🔸 యజమాని జారీ చేసిన ఫారం 16 
🔸 వివిధ డిడక్టర్లు జారీ చేసిన ఫారం 16ఏ 
🔸 టీడీఎస్‌ వెరిఫికేషన్‌ కోసం ఫారం 26ఏఎస్‌ 
🔸 ఇంటద్దె రశీదులు, ఒక్కొక్కప్పుడు యజమాని తీసుకోకపోయినా / పరిగణించకపోయినా మీరు డైరెక్టుగా క్లెయిమ్‌ చేయొచ్చు 
🔸 బ్యాంకు పాస్‌బుక్స్‌ లేదా బ్యాంకు వాళ్లు ఇచి్చన స్టేట్‌మెంట్లు 
🔸 ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రశీదులు 
🔸 క్యాపిటల్‌ గెయిన్స్‌ – దీర్ఘకాలికమైనవైతే ఆస్తుల అన్ని వివరాలు, కాగితాలు, రశీదులు మొదలైనవి 
🔸 క్యాపిటల్‌ గెయిన్స్‌ స్వల్పకాలికమైనా, ఆస్తులకు సంబంధించిన వివరాలు, కాగితాలు, రశీదులు 
🔸 షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కి సంబంధించి బ్రోకింగ్‌ సంస్థలు / ఏజెన్సీలు జారీ చేసిన స్టేట్‌మెంట్లు, సర్టిఫికెట్లు మొదలైనవి 
🔸 పాత పద్ధతిలో పన్నుభారం లెక్కించే విధానం ఎంపికలో 80సి, జీ, డి, జీజీ ఇలాంటి మినహాయింపులకు సంబంధించి కాగితాలు, నంబర్లు, వివరాల విషయంలో దయచేసి చాలా జాగ్రత్త వహించండి. 
షరా: కాగితాలు జతపర్చుకోనక్కర్లేదు, కానీ భద్రపరచాలి. వాటిలోని వివరాలు తెలియజేయాలి.

కొత్త మార్పులు 
ప్రత్యేకించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నుల్లో సమాచారపరంగా వచ్చిన మార్పులు ఏమిటంటే, స్పల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ 15 శాతం కొన్ని, 10 శాతం కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ ఒకే రేటు. తికమక ఉండదు. రివైజ్‌ రిటర్నుకి సంబంధించిన ఫీజు వివరాలు ఇవ్వాలి. 80సీ, 80డీ మొదలైన వాటి విషయాల్లో ప్రత్యేకంగా 80జీజీసీ వ్యవహారపు వివరాలు/ రిఫరెన్సు, పాన్‌ నంబరు ఇవ్వాలి. రిప్రజెంటేటివ్‌ అసెసీ వివరాల్లో పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ 
నంబర్లు తెలియజేస్తే చాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement