ఆపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు ఆపిల్ స్టోర్ల ముందు జనాలు క్యూ కడుతుంటారు. ఐఫోన్లతో పాటు ఆపిల్ స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్ లాంటి వాటికి కూడా వినియోగదారుల్లో క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఆపిల్ సంస్థ విడుదల చేసిన యాక్సెసరీపై మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దాని ధర చూసి నోరెళ్లబెడుతున్నారు.
ఐఫోన్ పాకెట్ (iPhone Pocket) అనే కొత్త, హై-ఫ్యాషన్ క్లాత్ యాక్సెసరీని ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. జపనీస్ ఫ్యాషన్ డిజైనర్ ఇస్సే మియాకే దీన్ని రూపొందించారు. చూడటానికి షూ సాక్స్ మాదిరిగా ఉన్న ఉంది ఈ పాకెట్. ఐఫోన్, ఇతర పరికరాలను ఇందులో వేసుకుని తగిలించుకునేలా దీన్ని తయారు చేశారు. ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను సులువులుగా క్యారీ చేసేందుకు దీన్ని రూపొందించినట్టు టెక్ దిగ్గజం వెల్లడించింది. దీని ధర రూ. 20,379 ($229.95) గా నిర్ణయించింది.
నెటిజనుల సెటైర్లు
ఐఫోన్ పాకెట్‌పై సోషల్ మీడియాలో నెటిజనులు సెటైర్లు పేలస్తున్నారు. ఇంత ధర పెట్టి ఈ గుడ్డ సంచిని ఎవరు కొంటారని కామెంట్స్ చేస్తున్నారు. ''టెక్ దిగ్గజ కంపెనీలు AI మోడళ్లను తయారు చేస్తుంటే, ఆపిల్ సాక్స్‌తో ఆడుకుంటోంది. @Appleలో ఏమి జరుగుతోంది?'' అని ఓ నెటిజన్ వాపోయాడు. ఐఫోన్ పాకెట్‌ను చూస్తే.. పేరడీలా ఉందని మరొకరు అన్నారు.
తాము ఎలాంటి ఉత్పత్తులు మార్కెట్‌లోకి విడుదల చేసినా అభిమానులు కొంటారనే అభిప్రాయంతో ఆపిల్ ఉన్నట్టుగా కనిపిస్తోందని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఐఫోన్ పాకెట్‌కు ఆదరణ పెరుగుతుందనే అభిప్రాయాన్ని ఒక నెటిజన్ వ్యక్త పరిచారు. ఆఫీసులకు వెళ్లే ధనిక ఆసియా మహిళలు ఇస్సీ మియాకే డిజైన్లు నచ్చుతాయని పేర్కొన్నారు.
చదవండి: వేదికపైనే కుప్పకూలిన రోబో
అయితే ఆపిల్ తన పరికరాల కోసం పౌచ్ లాంటి ఉత్పత్తిని రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. 2004లో స్టీవ్ జాబ్స్ (Steve Jobs) 29 డాలర్లకే ఐపాడ్ సాక్స్‌ను ప్రవేశపెట్టారు.
Will Apple fanboys defend this too?
Apple just dropped the “iPhone Pocket” basically a $230 knitted bag to wear your iPhone😭
At this point, it honestly feels like Apple is just testing how far its fans will go to justify anything. pic.twitter.com/ejnoGAppFD— Aares (@aares0205) November 11, 2025


