ఫిన్‌టెక్‌ సేవల్లోకి ఎల్‌ఐసీ | India Insurance Giant LIC Plans Fintech Arm to Boost Policyholder Returns | Sakshi
Sakshi News home page

ఫిన్‌టెక్‌ సేవల్లోకి ఎల్‌ఐసీ

Jun 1 2026 8:22 AM | Updated on Jun 1 2026 7:33 PM

India Insurance Giant LIC Plans Fintech Arm to Boost Policyholder Returns

సొంతంగా ఏర్పాటు చేసే యోచన

లేదంటే వ్యూహాత్మక పెట్టుబడి

ఎల్‌ఐసీ సీఈవో ఆర్‌ దొరైస్వామి 

ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ డిజిటల్‌ సేవలను పెద్ద ఎత్తున విస్తరించడంపై దృష్టి సారించింది. ఒక ఫిన్‌టెక్‌ సంస్థను ఏర్పాటు చేయడాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. పెరుగుతున్న డిజిటల్‌ సేవల అవసరాలను తీర్చేందుకు అవసరమైతే ప్రత్యేకమైన సేవలు అందించే సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిని సైతం పరిశీలిస్తున్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఆర్‌.దొరైస్వామి తెలిపారు.

‘సహజంగా ఆధునికీకరణ అవసరాలు, కొత్త ఆవిష్కరణల కోసం మేము ఫిన్‌టెక్, ఇన్సూర్‌టెక్‌ సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తుంటాం. ఈ సంస్థల ద్వారా పలు కొత్త విషయాలను తెలుసుకుంటుంటాం. పెద్ద ఆర్థిక సంస్థగా పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెడుతుంటాం. పాలసీదారుల రాబడులను మెరుగుపరిచేందుకు అవసరమనుకుంటే ప్రత్యేకమైన సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులనూ పరిశీలిస్తాం’ అని దొరైస్వామి తెలిపారు.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement