ఫారెక్స్‌.. ‘డౌన్‌’ టర్న్‌ | Sakshi
Sakshi News home page

ఫారెక్స్‌.. ‘డౌన్‌’ టర్న్‌

Published Sat, Feb 11 2023 10:45 AM

India Forex Reserves Down USD 1.5 Billion To USD 575 Billion - Sakshi

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) మూడు వారాల అప్‌ట్రెండ్‌ తర్వాత మళ్లీ దిగువముఖంగా పయనించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 1.49 బిలియన్‌ డాలర్లు తగ్గి, 575.267 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.  2021 అక్టోబర్‌లో భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి  100 బిలియన్‌ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజల్లో పురోగతి బాటన పయనించాయి. విభాగాల వారీగా చూస్తే.. 

  • డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో 1.3 బిలియన్‌ డాలర్లు తగ్గి, 508 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
  • పసిడి నిల్వలు 246 మిలియన్‌ డాలర్లు తగ్గి 43.781 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 66 మిలియన్‌ డాలర్లు పెరిగి, 18.544 బిలియన్‌ డాలర్లకు చేరింది.
  • ఇక ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ రిజర్వ్స్‌ పరిస్థితి 9 మిలియన్‌ డాలర్లు పెరిగి, 5.247 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement