ఫైనాన్స్‌ కంపెనీల పరిస్థితి ఎలా ఉందంటే?

ICRA Ratings Report On Micro Finance companies Performance - Sakshi

గతేడాది క్యూ4పై ఇక్రా రేటింగ్స్‌ నివేదిక 

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్‌లో ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)ల రుణ నాణ్యత మెరుగుపడినట్లు ఇక్రా రేటింగ్స్‌ పేర్కొంది. కోవిడ్‌–19(ఒమిక్రాన్‌) ప్రభావం పెద్దగా లేకపోవడం, పునర్వ్యవస్థీకరించిన లోన్‌ బుక్‌ కారణంగా స్లిప్పేజీలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు నివేదికలో ఇక్రా తెలియజేసింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో ఎన్‌బీఎఫ్‌సీల స్థూల స్టేజ్‌–3 (90 రోజులకు మించి చెల్లింపులు నిలిచిపోయిన) రుణాలు 5.7 శాతం నుంచి 4.4 శాతానికి క్షీణించినట్లు వెల్లడించింది. ఇక హెచ్‌ఎఫ్‌సీల స్టేజ్‌–3 రుణాలు 3.6 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయి. ఇక్రా నివేదిక ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల ప్రామాణిక పునర్వ్యవస్థీకృత బుక్‌ 2022 మార్చిలో 2.7–3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్‌లో గరిష్టానికి అంటే 4.5 శాతానికి చేరింది. ఇదేవిధంగా హెచ్‌ఎఫ్‌సీల బుక్‌ సైతం 2.2 శాతం నుంచి 1.4–1.6 శాతానికి దిగివచ్చింది. 

చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్‌ ఎలా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top