కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి | How To Update FASTag KYC Online Before 31 January | Sakshi
Sakshi News home page

FASTag KYC: కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి

Jan 30 2024 2:40 PM | Updated on Jan 30 2024 2:55 PM

How To Update FASTag KYC Online Before 31 January - Sakshi

ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌లను కేవైసీతో అప్డేట్ చేసుకోవాలని, దీని కోసం జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఎన్‌హెచ్‌ఏఐ ఇచ్చిన గడువు రేపటితో (జనవరి 31) ముగుస్తుంది. ఈ కథనంలో ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? అప్డేట్ చేయడం ఎలా? ఎందుకు అప్డేట్ చేసుకోవాలని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • ఓటీపీ అథెంటికేషన్‌ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్‌లో KYC స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు. 
  • సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే..

  • ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్‌ సెక్షన్‌ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.
  • దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. 
  • ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్‌ చేస్తే కేవైసీ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

ఇదీ చదవండి: మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్

కేవైసీ అప్డేట్ఎందుకంటే..
కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement