
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా 2019 & 2025 మధ్య తయారైన ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిళ్లకు రీకాల్ ప్రకటించింది. ఎడమవైపు ఉన్న హ్యాండిల్‌బార్ స్విచ్‌లోని వైరింగ్‌లో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ స్వచ్ఛందంగా ఈ ప్రకటన చేసింది.
ఈ సమస్య హ్యాండిల్ బార్ లోపల ఉన్న హార్నెస్ వైర్ నుంచి వస్తుంది. ఇది సాధారణ స్టీరింగ్ కదలికల కారణంగా పదే పదే వంగి ఉంటుంది. కాలక్రమేణా.. ఇది వైర్ జాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. తద్వారా హారన్ పనిచేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది. అంతే కాకుండా.. హెడ్‌లైట్‌ను లో బీమ్ నుంచి హై బీమ్‌కు మార్చడంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
2026 జనవరి చివరి వారం నుంచి.. భారతదేశంలోని అన్ని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లు మీ బైక్ ఇప్పటికీ వారంటీలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. కస్టమర్లకు కంపెనీ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లే డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.
భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ కోసం హోండా రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2024 ప్రారంభంలో, ఫిబ్రవరి, అక్టోబర్ 2022 లలో కూడా ఈ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రీకాల్ జారీచేయడానికి సిద్ధమైంది. ఆఫ్రికా ట్విన్ 1,048 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను కలిగి.. 100.5 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా హోండా DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో లభిస్తుంది.