
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 30 శాతం జంప్‌చేసి రూ. 4,004 కోట్లకు చేరింది. అత్యుత్తమ ప్రొడక్ట్ మిక్స్, వ్యయ నియంత్రణ ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 3,074 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 13 శాతం ఎగసి రూ. 64,232 కోట్లను తాకింది. అల్యూమినియంకు అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. గత క్యూ1లో రూ. 57,013 కోట్ల టర్నోవర్ అందుకుంది. యూఎస్ అనుబంధ సంస్థ నోవెలిస్ 1 శాతం అధికంగా 963 కేటీ షిప్‌మెంట్స్‌ను సాధించినట్లు కంపెనీ పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు 0.7% నీరసించి రూ. 667 వద్ద ముగిసింది.