
పండుగ సీజన్‌లో వాహనాల ధరలు కొంత తగ్గుతాయి, అప్పుడు నచ్చిన బైక్ కొనుగోలు చేద్దామని కొంతమంది వేచి చూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే జీఎస్‌టీ పెరుగుదల కారణంగా.. బైక్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ముఖ్యంగా 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్.. ఆన్ రోడ్ ధరలు ఇప్పుడు 30 శాతం లేదా.. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాగా తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అన్ని మోటార్ సైకిల్స్ 28 శాతం జీఎస్‌టీ కింద ఉన్నాయి. అయితే 350 సీసీ బైకులకు 28 శాతం జీఎస్‌టీతో పాటు 3 శాతం సెస్సు కలుస్తుంది. అంటే వీటిపై జీఎస్‌టీ 31 శాతానికి చేరుతుంది. ఇక త్వరలో రాబోయే జీఎస్‌టీ 2.0 విధానంలో రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ రద్దు అవుతాయి. అయితే 40 శాతం జీఎస్‌టీ అనేది లగ్జరీ వాహనాలకు వర్తిస్తుంది.
ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
జీఎస్‌టీ ప్రభావం వల్ల.. బైక్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు పెరుగుతాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రస్తుత ఆన్ రోడ్ ధర రూ. 3.80 లక్షలు. జీఎస్‌టీ కారణంగా దీని ధర రూ. 4.13 లక్షలకు చేరుతుంది. అదే విధంగా కేటీఎం ధర కూడా రూ. 3.60 లక్షల నుంచి రూ. 3.91 లక్షలకు చేరుతుంది. ట్రయంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్సన్ వంటి బైకుల ధరలు కూడా పెరుగుతాయి.