ఈ-కామర్స్‌ రంగంపై గూగుల్‌ కన్ను.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌ రంగంపై గూగుల్‌ కన్ను.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులు

Published Sat, May 25 2024 9:52 AM

Google Invests 350 Million In Flipkart

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌ ఈ-కామర్స్‌ రంగంపై కన్నేసింది. దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 350 మిలియన్‌ డాలర్ల విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌ విలువ 37 బిలియన్‌ డాలర్లు.

అయితే ఈ కొనుగోలుపై గూగుల్‌,ఫ్లిప్‌కార్ట్‌ స్పందించలేదు. కానీ వాటా కొనుగోలుపై రెగ్యులరేటరీ నుంచి ఆ రెండు సంస్థలు అనుమతులు తీసుకున్నాయంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

గూగుల్‌ తన పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో సహాయపడతాయి అని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

రీసెర్చ్‌ సంస్థ రెడ్ సీర్ అంచనాల ప్రకారం.. భారతదేశ  ఈ-కామర్స్‌ మార్కెట్ 2023లో 60-65 బిలియన్ల నుండి 2030 నాటికి 200-230 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ తరుణంలో బడాబడా కంపెనీలు భారత్‌ ఈ-కామర్స్‌ రంగంపై దృష్టి సారించాయి. తమ సేవల్ని విస్తరించనున్నాయి. 

బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు, తక్కువ ధరకే ఇంటర్నెట్‌ డేటా లభ్యంతో ఈకామర్స్‌ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగా 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు, బ్లింకిట్, మీషో, నైకా వంటి ఇతర సెగ్మెంట్‌లోని ఈ-కామర్స్‌ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement