గుడ్‌న్యూస్‌: క్విక్‌ హీల్‌ న్యూ వెర్షన్‌ 23 లాంచ్‌

good news Quick Heal launches new version with malware hunting tech - Sakshi

పుణె: సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్‌ హీల్‌’ మాల్వేర్‌ను గుర్తించే ‘వెర్షన్‌ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్‌ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్‌ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది.

ర్యామ్‌సమ్‌వేర్‌ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్‌ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్‌ అలర్ట్‌ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్‌ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్‌లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్‌ 23ని రూపొందించాం’’అని క్విక్‌ హీల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సంజయ్‌ కట్కర్‌ తెలిపారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top