
గేమ్‌లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!
స్పీడ్ డబుల్!
గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్‌లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్‌కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే.
బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్‌జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్‌కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!
కూల్ బేబీ కూల్!
గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్‌ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్‌లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్‌గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్‌లోని ఎల్‌ఈడీలు కంప్యూటర్ లుక్‌నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్‌ను మరింత పెంచుతాయి. కనెక్టర్‌తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్‌తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.
చప్పుడుదే విజయం!
గేమ్‌లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్‌సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్‌ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్‌తో ఆడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్‌లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్‌బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990.