భారత్‌తో రాస్‌నెఫ్ట్‌ బంధం బలోపేతం

G K Satish appointed as a board member of Russian Energy Giant Rosneft - Sakshi

బోర్డులో మొదటి భారతీయుని నియామకం  

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మాజీ డైరెక్టర్‌ జీకే సతీష్‌ (62)ను బోర్డులో నియమించింది. రాస్‌నెఫ్ట్‌ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి.  భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా 2021లో జీకే సతీష్‌  పదవీ విరమణ చేశారు.

11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్‌ ఒకరని రష్యన్‌ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్‌ క్షేత్రాలకు సంబంధించి రాస్‌నెఫ్ట్‌కు సతీష్‌ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్‌నెఫ్ట్‌ క్రూడ్‌ ఆయిల్‌నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్‌ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) అమ్మకంసహా భారత్‌ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్‌నెఫ్ట్‌ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top