Freshworks Company: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!

Freshworks Company Nearly 500 Indian Employees Just Turned Crorepatis - Sakshi

 500 Indian Employees Just Turned Crorepatis: భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్‌ ఐటీ సంస్థ నాస్‌డాక్‌లో లిస్టింగ్‌ చేసిన ఒక్కరోజులోనే  కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. నాస్‌డాక్‌ ట్రేడింగ్‌లో బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా 13 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. కాగా ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీలోని సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనారని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్‌ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు.
చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్‌ దేశాలు...!


నాస్‌డాక్‌ స్టాక్‌ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్‌ చేసిన భారతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థగా ఫ్రెష్‌వర్క్‌ నిలిచింది.  ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం,  షాన్ కృష్ణసామి స్థాపించారు. కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్‌ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను యాజమాన్యం తరలించింది. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, చెన్నైలో గణనీయమైన ఉద్యోగులను ఫ్రెష్‌వర్క్స్  కలిగి ఉంది.

ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుండి నిధులను ఫ్రెష్‌వర్క్స్‌ సేకరించింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్​డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్​డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది.
చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top