
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్'ను ప్రారంభించనుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పదేపదే టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా.. వాహనదారులు జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి ఈ పాస్ తీసుకొచ్చారు.
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ అనేది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చొరవ. ఇది తరచుగా ప్రయాణించేవారికి హైవే ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా.. ఇబ్బంది లేకుండా చేస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన ఈ పాస్.. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లిస్తే.. వాహనాలు ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్‌లు (ఏది ముందు అయితే అది) చేయడానికి అనుమతి పొందుతాయి.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది. దీని ఫలితంగా లక్షలాది మందికి వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. అయితే ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నవారు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) స్పష్టం చేసింది.
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఎలా పనిచేస్తుంది?
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ అనేది.. NHAI నిర్వహించే జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు (NE), ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, ముంబై-రత్నగిరి మార్గాల వంటి టోల్ ప్లాజాలలో మాత్రమే చెల్లుతుంది.
రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై, మీ FASTag సాధారణంగా పనిచేస్తుంది. టోల్ ఛార్జీలు యథావిధిగా వర్తిస్తాయి. ఉదాహరణకు, ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై - నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి మహామార్గ్), అటల్ సేతు, ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు - మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే, అహ్మదాబాద్ - వడోదర ఎక్స్‌ప్రెస్‌వే వంటి వాటిని రాష్ట్ర అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యాన్యువల్ పాస్ చెల్లుబాటు కాదని సమాచారం.
ఇదీ చదవండి: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే వంటి క్లోజ్డ్ టోలింగ్ హైవేలలో.. టోల్ వసూలు ప్రత్యేకంగా ఎగ్జిట్ పాయింట్ల వద్ద జరుగుతుంది. ఒకే ట్రిప్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు రెండూ ఉంటాయి. మరోవైపు.. ఢిల్లీ-చండీగఢ్ వంటి ఓపెన్ టోలింగ్ మార్గాలలో, ప్రతి టోల్ ప్లాజా క్రాసింగ్ ప్రత్యేక ట్రిప్‌గా ఉంటుంది. పాస్ చెల్లుబాటు ముగిసే వరకు వినియోగదారులు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించవచ్చు. చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత, సాధారణ ఫాస్ట్‌ట్యాగ్ మాదిరిగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ఎలా పొందాలి?
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ అనేది.. ఒక సాధారణ డిజిటల్ ప్రక్రియ. దీని కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయండి.
మీ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా, చెల్లుబాటు అయ్యేదిగా ఉండాలి. బ్లాక్‌లిస్ట్‌లో లేదని ముందుగానే చెక్ చేసుకోవాలి.
యాన్యువల్ పాస్ కోసం రూ. 3,000 ఆన్‌లైన్‌లో చెల్లించండి.
చెల్లింపులు పూర్తయిన తరువాత.. మీ యాన్యువల్ పాస్ మీ ప్రస్తుత FASTagకి లింక్ అవుతుంది.
#FASTagbasedAnnualPass for ₹3,000!
✅ Valid for 1 year or up to 200 toll plaza crossings – whichever is earlier – starting from the day you activate it.
✅ Enjoy seamless travel across highways without the hassle of frequent top-ups.
Travel smarter, travel with #FASTag!… pic.twitter.com/eDABOdqO2M— NHAI (@NHAI_Official) August 11, 2025