యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ బాదుడు, మామూలుగా లేదుగా!

European Central Bank hike of interest rates to tame inflation - Sakshi

 0.75 శాతం పెంపు

మాంద్యం భయాలకన్నా... ద్రవ్యోల్బణం కట్టడికే మొగ్గు   

ఫ్రాంక్‌ఫర్ట్‌: మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75శాతం పెంచుతూ  25 మంది సభ్యుల గవర్నింగ్‌ కౌన్సిల్‌ గురువారం ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి.

ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది.  19 దేశాల యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్‌ క్రిస్టినా లగార్డ్‌ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్‌ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2శాతం లక్ష్యానికి మించి,  ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9శాతానికి  ఎగసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top