ఈక్విటీ ఫండ్స్‌ డీలా..! | Equity mutual fund inflows decline 22 Percent to Rs 19013 crore in May | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌ డీలా..!

Jun 11 2025 1:29 AM | Updated on Jun 11 2025 8:02 AM

Equity mutual fund inflows decline 22 Percent to Rs 19013 crore in May

గణనీయంగా తగ్గిన పెట్టుబడులు 

మే నెలలో రూ.19,013 కోట్లు  

ఏప్రిల్‌ నెల కంటే 22 శాతం తక్కువ 

చెక్కుచెదరని సిప్‌ పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.

ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఐదో నెలలోనూ చోటు చేసుకుంది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో చేసే పెట్టుబడులు బలంగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.26,632 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.26,688 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు మే నెల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది.  

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి (ఈక్విటీ, ఈక్విటీయేతర) మే నెలలో రూ.29,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌లో ఇలా వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. 
⇒  మే చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.72.2 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్‌ చివరికి ఇది రూ.70 లక్షల కోట్లుగా ఉంది. 
⇒ ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

⇒ లార్జ్‌క్యాప్‌ పథకాలు రూ.1,250 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఏప్రిల్‌లో వచ్చిన రూ.2,671 కోట్లతో పోల్చితే సగంపైనే తగ్గాయి. 
⇒ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో రూ.3,313 కోట్లు రాగా, మే నెలలో రూ.2,808 కోట్లకు పరిమితమయ్యాయి.  
⇒ స్మాల్‌క్యాప్‌ పథకాలు రూ.3,214 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఏప్రిల్‌లో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.3,999 కోట్లుగా ఉన్నాయి.  

⇒ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,656 కోట్లు, మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,518 కోట్లు, సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌లోకి రూ.5,712 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  
⇒ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ నుంచి రూ.678 కోట్లు, వ్యాల్యూ/కాంట్రా ఫండ్స్‌ నుంచి రూ.92 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.  
⇒ ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి 73 శాతం తక్కువగా రూ.5,525 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌లో ఈ రెండు ప్యాసివ్‌ ఫండ్స్‌ విభాగాల్లోకి రూ.20,229 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.  

⇒ మే నెలలో మొత్తం 19 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రాగా, ఇవి ఉమ్మడిగా రూ.4,170 కోట్లను సమీకరించాయి.  
⇒ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.292 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు.  
⇒ డెట్‌ ఫండ్స్‌ నుంచి మే నెలలో నికరంగా రూ.15,908 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఏప్రిల్‌ నెలలో ఇదే విభాగం రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.  

⇒ డెట్‌లో కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ విభాగం రూ.11,983 కోట్లు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌ రూ.11,223 కోట్ల చొప్పున మెరుగ్గా పెట్టుబడులను ఆకర్షించాయి. 
⇒  లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.40,205 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.  
⇒  ఈక్విటీ, డెట్‌లో పెట్టుబడులు పెట్టే హైబ్రిడ్‌ ఫండ్స్‌ 46 శాతం అధికంగా రూ.20,765 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.  
⇒ ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లోకి రూ.15,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

రిస్క్‌ ధోరణి తగ్గింది..  
‘‘ఈక్విటీ ఫండ్సలోకి పెట్టుబడులు తగ్గడం వెనుక ఎన్నో  కారణాలున్నాయి. ముందటి నెలలతో పోల్చిచూస్తే మే నెలలో ఈక్విటీలు మంచి పనితీరు చూపించాయి. స్థిరీకరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉంటారు. పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం భౌగోళిక ఉద్రి క్తతలు పెరగడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బ ణం పట్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లలో రిస్క్‌ తీసుకునే సెంటిమెంట్‌ బలహీనపడి ఉంటుంది’’అని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో జతీందర్‌ పాల్‌ సింగ్‌ తెలిపారు. మారి్నంగ్‌ స్టార్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ సై తం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేవా రు. అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉంటారని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement