Elon Musk: ఇస్మార్ట్‌ ఎలన్‌మస్క్‌.. మరో అద్భుత ఆవిష్కరణకు రెడీ !

Elon Musk Neuralink Ready to implant chips in human brains - Sakshi

Neuralink Ready to implant chips On Human Brain: భవిష్యత్తును ముందే ఊహించగలగడం అందుకు తగ్గ సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు ఎలన్‌ మస్క్‌. అందువల్లే అనతి కాలంలోనే ప్రపంచ కుబేరుడిగా మారాడు. ఇప్పటికే టెస్లా, స్టార్‌లింక్‌లతో ఈవీ, స్పేస్‌ రంగాల్లో దూసుకుపోతున్న ఎలన్‌ మస్క్‌.. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై కన్నేశాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తరహాలో మనిషి మెథడులో చిప్‌ అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

చేతులతో పని లేదు
ఎలక్ట్రానిక్‌ చిప్‌తో మానవ మేథడును అనుసంధానం చేసే ప్రాజెక్టుని ‍న్యూరాలింక్‌ పేరుతో ఎలన్‌ మస్క్‌ ఎప్పుడో ప్రారంభించారు. వందల కొద్ది శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. మానవ మేథతో అనుసంధానం అవగలిగే ఒ చిప్‌ను, అమర్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గతేడాది అందుబాటులోకి వచ్చింది. సింపుల్‌గా న్యూరాలింక్‌ గురించి వివరించాలంటే... ఎలక్ట్రానిక్‌ చిప్‌తో మెథడు అనుసంధానం అయితే.. మౌస్‌, కీబోర్డులతో పని లేకుండా చిప్‌ అమర్చిన ఆలోచనలకు తగ్గట్టుగా కంప్యూటర్‌ పని చేస్తుంది. ఫిజికల్‌గా కమాండ్స్‌ ఇవ్వకుండానే పనులు చేసుకోవచ్చు. భవిష్యత్తులో హెల్త్‌ సెక్టార్‌లో అనేక సమస్యలకు ఈ టెక్నాలజీతో పరిష్కారం చూపే వీలుందని ఎలన్‌మస్క్‌ అంటున్నారు.

డైరెక్టర్‌ కోసం వేట
న్యూరాలింక్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ‍కోతిపై ఈ ప్రయోగాలు చేసిన మస్క్‌ టీం.. ఇప్పుడు మానవుల మీద క్లినికల్‌ ట్రయల్స్‌కి రెడీ అవుతోంది. ఈ మేరకు క్లినికల్‌ ట్రయల్స్‌ డైరెక్టరు పోస్టును భర్తీ చేయబోతున్నాడు ఎలన్‌ మస్క్‌. ఈ మేరకు శాస్త్రవేత్తలకు ఆహ్వానం పంపాడు. క్లినికల్‌ ట్రయల్స్‌ డైరెక్టర్‌ పదవిని ఆశించే వ్యక్తి అత్యుత్తమమైన డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు న్యూరాలింక్‌ ప్రాజెక్టులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుందని జాబ్‌ డిస్‌క్రిప్షన్‌లో పేర్కొన్నారు.  

చదవండి: ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం..! ఇక మనుషుల్ని ఆడించనున‍్నాడా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top