
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన DESRI.. హైదరాబాద్‌లోని ఆర్ఎంజెడ్ నెక్సిటీలో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుంచి ప్రయోజనం పొందుతూ, హైదరాబాద్‌ను తన ప్రపంచ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని ప్రారంభించింది.
2014లో హైదరాబాద్‌లో మొదటిసారి కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి.. కౌంటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్‌తో సహా వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నేడు కంపెనీ అనేక కీలకమైన కార్యకలాపాలలో కీలక పాత్రను పోషిస్తోంది.
కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా.. DESRI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జ్విల్లింగర్ మాట్లాడుతూ, హైదరాబాద్ DESRIకి వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అంతే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్ఎంజెడ్ నెక్సిటీలో మా కొత్త కార్యాలయం ప్రారంభం, భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు.