
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణకు ఉపయోగపడేలా ‘ఎనేబ్లర్’ పేరిట కొత్త సర్వీస్‌ల విభాగాన్ని ప్రారంభించినట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ వెల్లడించింది. కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేయడం, నిర్వహించుకోవడం, కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడానికి సంబంధించి కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించి ఎనేబ్లర్ తగు వ్యూహాలను అందిస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా
సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకోవడం నుంచి ఆటోమేషన్, అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవడం వరకు ఇది అన్ని రకాల సేవలను అందిస్తుందని వివరించింది. కేవలం కంపెనీల కార్యకలాపాల నిర్వహణ పరమైన పనులకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, వ్యూహాల్లో కూడా భాగస్వాములుగా జీసీసీలు ఎదిగేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోవాసెంట్ టెక్నాలజీస్ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 150 జీసీసీల ఏర్పాటుపై ఎనేబ్లర్ దృష్టి పెట్టినట్లు సంస్థ వివరించింది.