హైబ్రిడ్‌ ఎంతో హాయి..

Cisco Survey Report On Work Culture - Sakshi

కరోనా సంక్షోభం తర్వాత తెర మీదకు వచ్చిన హైబ్రిడ్‌ వర్క్‌ విధానం ఎంతో బాగుందంటున్నారు ఉద్యోగులు. కరోనా భయాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతుండగా మరికొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంను కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఈ రెండింటి కలయికగా ఉద్యోగులు తమకు నచ్చినట్టు ఆఫీసు, ఇంట్లో పని చేసుకునే వెసులుబాటు హైబ్రిడ్‌ విధానంలో ఉంది.

ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం లేదా ఆఫీసు ఉంచి పని ఈ రెండింటిలో ఏ పని సౌకర్యంగా ఉందో తెలుసుకునేందుకు గ్లోబల్‌ స్టడీ సంస్థ సిస్కో ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో నూటికి 61 శాతం మంది హైబ్రిడ్‌ వర్క్‌ విధానం బాగుందంటూ సమాధానం ఇచ్చారు. హైబ్రిడ్‌ మోడ్‌లో పనితీరు, ప్రొడక్టివిటీ కూడా మెరుగైందని చెబుతున్నారు. దీంతో పాటు మానసికంగాను చాలా ఉత్తేజవంతంగా ఉంటున్నామని వెల్లడించారు.

చదవండి: ఉద్యోగుల షాక్‌, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top