‘పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తెచ్చేందుకు మేము సిద్ధం.. కానీ’

Central Govt Ready To Bring Petrol And Diesel Under Gst Says Petroleum Minister - Sakshi

శ్రీనగర్‌: జీఎస్‌టీ కిందకు పెట్రోల్, డీజిల్‌ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కానీ, ఇందుకు రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చన్నారు. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా తప్పనిసరి అన్నది గుర్తు చేశారు. రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళుతుందని పురి చెప్పారు.

దీన్ని ఎలా అమలు చేయాలన్నది మరో అంశంగా పేర్కొన్నారు. దీనిపై ఆర్థికమంత్రి స్పష్టత ఇవ్వగలరని పేర్కొన్నారు. లిక్కర్, ఇంధనాలు రాష్ట్రాలకు ఆదా య వనరులుగా ఉన్నందున, వాటిని జీఎస్‌టీ కిందకు తీసుకురావడానికి అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి వినిపించారు.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top