
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్‌లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్‌లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్‌కేస్ సైజ్‌లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్‌లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.
కొడాక్ చార్మెరా ఫీచర్లు..
ఇది ఒక మినీ కెమెరా.
దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్‌ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.
దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).
ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.
1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్‌లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.
30fps ఈవీఐ వీడియో
ఎస్‌సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్
యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్.
మైక్రో ఎస్‌డీ స్లాట్ (128GB వరకు)
ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్