స్నేహితుడి కోసం కేక్‌ చేసిన బిల్‌గేట్స్‌ | Sakshi
Sakshi News home page

వారెన్‌ కోసం కేక్‌ తయారు చేసిన బిల్‌గేట్స్‌

Published Mon, Aug 31 2020 3:28 PM

Bill Gates Bakesd A Cake For His Friend Warren Buffet - Sakshi

ప్రపంచంలోని అన్ని బంధాల్లో స్నేహ బంధం గొప్పదంటారు. తల్లదండ్రులకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను కేవలం స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహితుల పుట్టిన రోజు వస్తే ఖచ్చితంగా ఎదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే.. ఆ బహుమతి విలువ దాని ఖరీదును బట్టి కాకుండా ఇచ్చే స్వచ్చమైన మనుసును బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన స్నేహితుడికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. మైక్రోసాప్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్.. అవును తన స్నేహితుడు,  ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ ఆదివారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ తన స్నేహితుడి కోసం స్వయంగా కేకును తయారు చేసి వారెన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. (‘2021 మే నాటికి కరోనా అంతం’)

కేక్‌ తయారు చేసిన వీడియోను బిల్‌గేట్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిమిషం నిడివిగల ఈ వీడియోకు ‘90వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వారెన్’‌ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో  కేకు కోసం పిండిని జల్లెడ పట్టం, చాక్లెట్‌ కట్‌ చేయడం నుంచి అన్ని పనులను ఆయనే చేశారు. ఆఖరుగా కేకును బేక్‌ చేసి దానిపై ఓరియో బిస్కెట్లతో అందంగా తయరు చేశాడు. ఒక పీస్‌ను కట్‌ చేసి పెట్టాడు. అతను చివరకు తుది ఉత్పత్తితో పోజులిచ్చాడు మరియు కేక్ నుండి ఒక ముక్కను కత్తిరించాడు. అయితే కేకుతోపాటు భావోద్వేగ లేఖను కూడా స్నేహితుడి కోసం రాశారు.  ఇందులో వారెన్‌ వ్యక్తిగత జీవితం, స్నేహం బంధం గురించి వివరించారు. కాగా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ తొలిసారిగా 1991 జూలై 5న కలుసుకున్నారు. (2020లో వారెన్‌ బఫెట్‌ సంపదకు చిల్లు)

Advertisement
 
Advertisement
 
Advertisement