కొడుకు స్పీచ్‌.. ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్‌

Anant Ambani Emotional Speech Mukesh Ambani Tears video - Sakshi

Mukesh Ambani tears video : రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడుకు మాటలకు ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్‌ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్‌ గురించి అనంత్‌ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ మారింది.

థాంక్యూ అమ్మా.. నాన్న
"ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నా కోసం చాలా కష్టపడింది. గత నాలుగు నెలలుగా ఆమె రోజుకు 18-19 గంటలు నా కోసం కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను . అమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు" అని అనంత్ అంబానీ ప్రసంగంలో పేర్కొన్నారు. "మా నాన్న, అమ్మ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసాన్ని నాకు కలిగించారు. మా నాన్న, అమ్మ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో.. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞుడను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

నా కొడుకులోనే చూసుకుంటున్నా
కాగా అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు, ఇతర అతిథులందరినీ ఉద్దేశిస్తూ ముఖేష్‌ అంబానీ ప్రసంగించారు. కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ అనుబంధం గురించి ప్రస్తావించారు. తన చిన్న కొడుకు అనంత్‌ అంబానీలోనే చనిపోయిన తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీని చూసుకుంటున్నట్లు వెల్లడించారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top