భారత్‌ విజయం.. ఆ విషయంలో ఇంతకుమించిన ఆనందం మరొకటిలేదు: ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra Tweet On India Won On Pakistan In T20 World Cup - Sakshi

భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆ క్రేజ్‌ వేరుంటది. ప్రపంచవ్యాప్తంగా ఉ‍న్న క్రికెట్‌ ప్రేమికులు ఈ దాయాది దేశాల పోరు చూసేందుకు సిద్ధంగా ఉంటారు. సెలబ్రిటీల నుంచి, సామాన్య ప్రజలు వరకు ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తారు.  తాజాగా  ఆదివారం( అక్టోబర్‌ 23) జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తూ పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తనదైన శైలిలో ట్వీట్‌తో స్పందించారు.

ఇంతకన్నా ఆనందం మరొకటి లేదు
వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. సోషల్‌ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటెరాక్టర్‌ అనేది అందరికీ తెలిసిందే. సమాజంలో జరుగుతున్న అంశాలపై స్పందించడంతో పాటు టాలెంట్‌ను ప్రోత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన పెడుతున్న పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఆయన పాకిస్తాన్‌పై భారత్‌ విజయం సాధించడం పట్ల స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. 

అందులో..  భారత్‌ మైండ్‌వర్స్‌ స్టేడియంలో విజయం సాధించింది. ప్రత్యర్థిపై సులభమైన విజయం కన్నా ఉత్కంఠ భరితమైన గెలుపే ఉత్సాహాన్నిస్తుంది. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం, అంతకన్నా సంతోషం మరొకటి లేదు. జయహో ఇండియా అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్‌ చేయకండి, మోసపోతారు జాగ్రత్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top