సరికొత్తగా అమెజాన్ లోగో | Amazon Reveals New App Icon | Sakshi
Sakshi News home page

సరికొత్తగా అమెజాన్ లోగో

Jan 27 2021 8:36 PM | Updated on Jan 27 2021 8:48 PM

Amazon Reveals New App Icon - Sakshi

ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏ చిన్న వస్తువు కొనలన్నా ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గ్గజం 'అమెజాన్'లో కొనేస్తున్నాం. ఇప్పుడు పట్టణాల నుంచి పల్లె ప్రాంతాల కూడా అమెజాన్ సేవలు విస్తరించాయి. అంతలా నెటిజన్లకు దగ్గరైన అమెజాన్‌ గత కొన్నేళ్లుగా ఒకే లోగోతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న లోగోలో అమెజాన్‌ పేరు, నీలి రంగులో షాపింగ్‌ కార్టు బొమ్మ మనకు కనిపిస్తాయి. పలు యాప్‌ స్టోర్‌ల్లో కూడా అదేవిదంగా మనకు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇకపై మరో కొత్త అవతార్‌తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. యాపిల్‌ యూజర్లు కొందరు కొత్త అమెజాన్ ఐకాన్‌ ను గుర్తించారు. కొత్త ఐకాన్(క్రింద)లో పేరు లేకుండా బ్రౌన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అమెజాన్ సంతకం బాణం/ స్మైల్ లోగో డిజైన్‌ను రూపొందించారు. మొత్తంగా లోగో డిజైన్‌ ‘షిప్పింగ్‌ బాక్స్‌’లను పోలి ఉండేలా తీర్చిదిద్దారు.(చదవండి: వన్‌ప్లస్‌ ప్రియులకి గుడ్ న్యూస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement