తెలంగాణలో మరో అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌...!

Amazon Expands Presence In Telangana With 5th Fulfilment Centre - Sakshi

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఫుల్‌ఫిల్‌ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ రాష్ట్రంలో మరో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మేడ్చల్‌లో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్‌ కెపాసిటీపి పెంచింది.

తాజాగా అమెజాన్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కంపెనీ ఐదు ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను కలిగి ఉండనుంది. అంతేకాకుండా  రాష్ట్రంలో ఒక మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్‌ అవతరించనుంది. రాష్ట్రంలో అమెజాన్‌ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది. ఈ సందర్బంగా అమెజాన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీస్‌ డైరక్టర్‌ అభినవ్‌ సింగ్‌ మాట్లాడుతూ..తాజా విస్తరణతో అమెజాన్‌ తన కస్టమర్లకు లార్జ్‌ అప్లయేన్సస్‌, ఫర్నిచర్‌ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సాధికారిత వస్తోందని తెలిపారు. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్‌ ఫ్లోర్‌ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్‌ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top