కొత్తగా 27.3 లక్షల టెక్‌ జాబ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నివేదిక | AI could create 2 73 million jobs by 2028 ServiceNow report | Sakshi
Sakshi News home page

కొత్తగా 27.3 లక్షల టెక్‌ జాబ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నివేదిక

Nov 17 2024 1:14 PM | Updated on Nov 17 2024 1:23 PM

AI could create 2 73 million jobs by 2028 ServiceNow report

ముంబై: వర్ధమాన సాంకేతికతల తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2023లో 42.37 కోట్లుగా ఉన్న వర్కర్ల సంఖ్య 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. వెరసి అయిదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య 3.38 కోట్ల స్థాయిలో వృద్ధి చెందనుంది. వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా 27.3 లక్షల టెక్‌ కొలువులు రానున్నాయి.

అమెరికన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సర్వీస్‌నౌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక, సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో 15 లక్షలు, విద్యారంగంలో 8.4 లక్షలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 80 లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి. అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై–వేల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది.

ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్‌.. మీరొస్తామంటే మేమొద్దంటామా?

జనరేటివ్‌ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్‌ ఇంజినీర్లు, ఇంప్లిమెంటేషన్‌ కన్సల్టెంట్లు, ప్లాట్‌ఫాం ఓనర్లకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. రిటైల్‌ ప్రొఫెషనల్స్‌ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, డేటా ఇంజినీరింగ్‌ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement