సీడీఎస్‌ఎల్‌ రికార్డు, 7 కోట్లు దాటేసిన డిమ్యాట్‌ ఖాతాలు

Active Demat accounts on CDSL cross 7crore mark - Sakshi

డీమ్యాట్‌ ఖాతాలు 7 కోట్లు 

న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవలను అందించే సీడీఎస్‌ఎల్‌ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ నిర్వహణలో డీమ్యాట్‌ ఖాతాలు 7 కోట్ల మార్క్‌ను దాటాయి. సీడీఎస్‌ఎల్‌ 1999లో కార్యకలాపాలు ప్రారంభించింది. డీమ్యాట్‌ ఖాతాల ద్వారా ఇన్వెస్టర్ల సెక్యూరిటీల లావాదేవీలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంటుంది.

తాము ఏడు కోట్ల ఖాతాల మైలురాయిని అధిగమించడం తమకు మాత్రమే కాకుండా, మొత్తం భారత సెక్యూరిటీల మార్కెట్‌ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సీడీఎస్‌ఎల్‌ ఎండీ, సీఈవో నెహల్‌ వోరా అన్నారు. యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య పరంగా సీడీఎస్‌ఎల్‌ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీ సేవల సంస్థగా ఉంది. మరో సంస్థ ఎన్‌ఎస్‌డీఎల్‌ కూడా ఇదే విధమైన సేవలు అందిస్తుంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top