మరో‘సారీ’ 34శాతమే.. | - | Sakshi
Sakshi News home page

మరో‘సారీ’ 34శాతమే..

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ● గత ఏడాది మాదిరే ఇవ్వడంపై కార్మికుల పెదవి విరుపు ● ఒక్క శాతం పెరిగినా లాభమయ్యేదని వెల్లడి ఆశలు అడియాలయ్యాయి... 10శాతం ఇవ్వకపోవడం దారుణం

గత పదేళ్లుగా లాభాల వివరాలు..

● సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ● గత ఏడాది మాదిరే ఇవ్వడంపై కార్మికుల పెదవి విరుపు ● ఒక్క శాతం పెరిగినా లాభమయ్యేదని వెల్లడి

రుద్రంపూర్‌: సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా ఈసారి కూడా 34శాతమే ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏ మాత్రం పెంచకపోవడంపై కార్మికులు పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లాభాల వాటాపై ప్రకటన చేశారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ సాధించిన రూ.1,754కోట్ల లాభాల నుంచి 34శాతం వాటా కింద రూ.596.36కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,53,912 అందే అవకాశముంది. ఈ మొత్తాన్ని దసరా పండుగలోగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

గతంతో పోలిస్తే తక్కువ

2024–25 ఆర్థిక సంవత్సరంలో కార్మికులకు సగటున రూ.2లక్షల వరకు లాభాల వాటా కింద అందాయి. అయితే, ఈసారి గత ఏడాదితో సమానంగా వాటా ప్రకటించినా లాభాలు తగ్గడంతో కార్మికులకు వచ్చే వాటా ఈసారి రూ.50వేల వరకు తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క శాతం వాటా పెంచినా మరింత నగదు వచ్చేదని చెబుతున్నారు. కంపెనీలో 38,737 మంది శాశ్వత, 29,715మంది కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా అందనుంది. శాశ్వత కార్మికులకు లాభాల వాటా చెల్లింపులో మస్టర్లు, వ్యక్తిగత పనితీరు, గ్రూపు పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి వాస్తవ లాభాలు రూ.2,600 కోట్లు వచ్చాయని, పన్నులు మినహాయించి నికర లాభంగా చూపినట్లు సమాచారం.

కాంట్రాక్ట్‌ కార్మికులకు నిరాశే..

కాంట్రాక్ట్‌ కార్మికులకు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రూ.5,500 చొప్పున బోనస్‌ ప్రకటించారు. ఈసారి 10శాతం వాటా ఇవ్వాలని లేదా కనీసం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా ఫలితం దక్కలేదు.

గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు ఈసారి కార్మికులకు మెరుగైన లాభాల వాటా ఇప్పిస్తామని చెప్పాయి. కనీసం ఒక్క శాతం వాటా అయినా పెంచుతారని భావిస్తే ఆశలు ఆడియాసలయ్యాయి. ఇంత కంటే దారుణం, దుర్మార్గం మరొకటి ఉండదు.

– రియాజ్‌ అహ్మద్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి

పర్మనెంట్‌ కార్మికులతో సమానంగా పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. సంస్థకు లాభాలు తీసుకురావడంలో కీలకమైన కార్మి కులకు కనీసం 10శాతం వాటా ప్రకటించకపోవ డం గర్హనీయం. ఈవిషయమై ఆందోళనలు చేస్తాం.

– యాకూబ్‌షావలీ, రాష్ట్ర అధ్యక్షుడు,

ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌

సంవత్సరం సాధించిన నికర లాభం పంచిన వాటా వాటా శాతం

ఉత్పత్తి (మి.టన్నుల్లో) (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

2016–17 61.34 395 99 25

2017–18 62.01 1,212 327 27

2018–19 64.40 1,765 494 28

2019–20 64.02 993 278 28

2020–21 50.58 272.64 79.07 29

2021–22 65.02 1,227 368 30

2022–23 67.14 2,222 711 32

2023–24 70.02 2,412 796 33

2024–25 69.01 2,360 819 34

2025–26 58.00 1,754 596.36 34

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement