సంతానలక్ష్మిగా శ్రీమహాలక్ష్మి దర్శనం | - | Sakshi
Sakshi News home page

సంతానలక్ష్మిగా శ్రీమహాలక్ష్మి దర్శనం

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

అన్నపూర్ణాదేవి అవతారంలో పెద్దమ్మతల్లి

భద్రాచలం: భక్తుల పాలిట కల్పవల్లిగా, సకల శుభాలను ప్రసాదించే జగన్మాతగా శ్రీమహాలక్ష్మి అమ్మవారు విశేష అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో కొలువుదీరారు. సంతానప్రాప్తి, కుటుంబ సౌభాగ్యం, సుఖసంతోషాలను ప్రసాదించే అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు, కుంకుమార్చనలు జరిపారు. మరోవైపు మారుతి సదనంలో శ్రీ రామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు అయోధ్యకాండ పారాయణం చేశారు. కాగా, అమ్మవారు బుధవారం ఇరువైపులా గజరాజులు బంగారు కలశాలతో అభిషేకం చేస్తున్న దివ్యరూపంలో గజలక్ష్మిగా దర్శనమిస్తారు. ఇక శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పాల్వంచరూరల్‌: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారు మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాగా, అమ్మవారిని ఎస్పీ రోహిత్‌రాజ్‌ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అలయ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ.. భక్తుల రద్దీ దృష్ట్యా దసరా ఉత్సవాలు ముగిసే వరకు బందోబస్టు ఏర్పాట్లు నిర్వహించాలని సీఐ సతీష్‌, ఎస్‌ఐ సురేశ్‌కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement