పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయం గుర్రపు డెక్కతో నిండిపోవడంతో బోటింగ్‌కు ఆటంకం కలు గుతోంది. దీంతో కిన్నెరసానిలో విహరిద్దామని వస్తు న్న పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. జలాశయంలోని బోటింగ్ పాయింట్ వద్ద గుర్రపు డెక్క మొక్కలు అల్లుకుపోయాయి. దీంతో బోట్లను పాయింట్ వద్ద కాకుండా అద్దాలమేడ వైపు నిలుపుతున్నారు. అక్కడికి వెళ్లాలంటే ప్రాజెక్ట్ నుంచి కిలోమీటరుకు పైగా అటవీ ప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. పర్యాటకులు అంతదూరం నడవలేక బోటింగ్ చేయడంలేదు. శ్రమకోర్చి ఎవరైనా వెళ్లినా బోటింగ్ కొంతదూరమే నిర్వహిస్తుండటంతో అనాసక్తి చూపుతున్నారు. గుర్రపు డెక్క అల్లుకుపోవడంతో బోట్లు తిరిగే పరిస్థి తిలేదని డ్రైవర్లు చెబుతున్నారు. వెరసి టూరిజం శాఖకు ఆదాయం తగ్గిపోతోంది. అధికారులు స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
ఒక రోజు ఆదాయం రూ.36 వేలు
కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. డీర్ పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం కొందరు బోటు షికారు చేశారు. ప్రవేశ రుసుం, సఫారీ, బోటింగ్ ద్వారా మొత్తం రూ. 36 వేల ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కిన్నెరసానిలో పర్యాటకులకు నిరాశ


