భద్రగిరిలో దసరా వైభవం | - | Sakshi
Sakshi News home page

భద్రగిరిలో దసరా వైభవం

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

16న ధాన్యలక్ష్మిగా.. 14న గజలక్ష్మిగా.. 18న ఐశ్వర్య లక్ష్మిగా..

‘ధన ధాన్యకరీం...సిద్దిం’ అంటూ కీర్తిస్తుంది పురాణం. అన్ని రకాల ధాన్యాన్ని ప్రసాదించేది అమ్మేనని, అమ్మవారిని ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగి, సమయానికి తగిన వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. వ్యవసాయ ప్రధానమైన భారత దేశ సౌభాగ్యం కోసం ధాన్యలక్ష్మిని పూజిస్తారని చెబుతున్నారు. అనంతరం కిష్కింధకాండ పారాయణం చేస్తారు.

‘లక్ష్మీః దివ్యైః గజేందైః మణిగణఖచితైః స్నాపితా హేమకుంబైః’ అని కీర్తిస్తారు పూర్వాచార్యులు. ఈ రూపంలో అమ్మను ఆరాధిస్తే అధికారం, మహా సంపద కలుగుతాయని శాస్త్రం పేర్కొంటోంది. గజలక్ష్మిని ఆరాధించే దేవేంద్రుడు త్రైలోకాధిపత్యాన్ని సాధించాడని పురాణంలో ఉందని, ఆ అమ్మ ను పూజిస్తే చెదరని అధికారం, తరగని సంపద కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. అయోధ్యకాండ పారాయణం జరుపుతారు.

‘అస్యేశానా జగతో విష్ణుపత్నీ’ అని కీర్తిస్తుంది యజుర్వేదం. ఐశ్వర్యం అంటే శాఖాపరమైన శక్తి సామర్థ్యాలని, అమ్మవారి క్రీగంటి చూపుల కదలికలనే శాసనాలుగా భావించి శ్రీ మహావిష్ణువు సకల జగద్రక్షణ చేస్తుంటాడని శ్రీ పరాశరభట్టార్‌ కీర్తించారు. ఈ రూపంలో తల్లిని ఆరాధిస్తే శాసకత్వం, వాక్కుకు ప్రభావం, అనంత ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. యుద్ధకాండ పారాయణం జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement