వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

గరిష్టం / కనిష్టం

340 / 240

రేగళ్ల ఆశ్రమ పాఠశాల తనిఖీల్లో కలెక్టర్‌ అంకిత్‌

వార్డెన్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని ఆదేశం

జిల్లాలో గురువారం మధ్యాహ్నం వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

మెనూ సక్రమంగా

అమలు చేయాలి

చుంచుపల్లి: హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ హెచ్చరించారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌సీసీ కార్యాలయాన్ని పరిశీలించారు. బాలుర వసతి గృహాన్ని పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. కిచెన్‌, స్టోర్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. ఆర్వో వాటర్‌ ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బుధవారం మెనూలో చికెన్‌ అందించాల్సి ఉండగా, విద్యార్థులకు వడ్డించిన భోజనంలో చికెన్‌ లేకపోవడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

విపత్తుల వేళ ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలి

విపత్తుల సమయంలో ఆపదమిత్రలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఆరో బెటాలియన్‌ తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్తుల వేళ అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ఆపదమిత్రలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ పీసీవి రమణ, తహసీల్దార్‌ శిరీష, ఎంపీడీఓ సుస్మిత, శ్రీధర్‌ రాజా, మరియా దాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement