భద్రాచలంఅర్బన్: వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తు చర్యగా గర్భిణులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేర్చగా.. గర్భిణుల అటెండెంట్లలో కొందరు ఇళ్లకు వెళ్లేందుకు సుముఖత చూపుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి పంపాలని పట్టుబడుతున్నారు. ఇందుకు ఆస్పత్రిలో అందిస్తున్న భోజనం బాగాలేదని కారణంగా చెబుతున్నారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు మాత్రం ఆస్పత్రి నుంచి కదలడం ఎంతమాత్రం సురక్షితం కాదని తేల్చిచెబుతున్నారు. వరదలు తగ్గినా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేమని, అకస్మాత్తుగా నొప్పులు వస్తే రవాణా అత్యంత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ మేరకు వారికి అవగాహన కల్పించారు.


