దుమ్ముగూడెం: ప్రైవేట్ బస్సు కండక్టర్లుగా మొదలైన వారి పరిచయం ప్రభుత్వ ఉద్యోగంలోనూ, తర్వా త వ్యాపార రంగంలోనూ కొనసాగుతోంది. మండలంలోని లక్ష్మీనగరానికి చెందిన వాకచర్ల గౌరీశంకర్, భద్రాచలానికి చెందిన సారథి రమేశ్ 1984లో ప్రైవేట్ బస్సులో కండక్టర్లుగా పనిచేస్తుండగా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. 1988లో ఆర్టీసీలో కండక్టర్లుగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. గౌరీశంకర్ 1999లో ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా రమేశ్ సైతం 2002లో ఉద్యోగాన్ని వీడి వ్యాపారంలో ప్రవేశించారు. 1984లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అంతే బలంగా కొనసాగుతోంది.


