సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. నిరంతరం సేవలు అందుతాయని, సోమవారం నుంచి మూడు షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వరిస్తారని పేర్కొన్నా రు. ఫిర్యాదులు, సమాచారం, వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను వెంటనే నమోదు చేసి సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతినడం, లోతట్టుప్రాంతా ల్లో నీరు నిల్వ ఉండటం, వాగులు, వంకలు పొంగి పొర్లడం వంటి పరిస్థితులు తలెత్తితే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు 08744–241950 నంబరులో సంప్రదించాలని కోరారు.
పురాతన విగ్రహాలు లభ్యం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని ఊట్లపల్లి సమీపంలో ఉన్న వెంకమ్మ చెరువు అలుగులో కాకతీయుల కాలం నాటి పురాతన విగ్రహాలు శనివా రం వెలుగు చూశాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువు అడుగంటింది. దీంతో అలుగు ప్రాంతంలో పురాతన కాలం నాటి రాతి నంది, వినాయక విగ్రహంతోపాటు శివలింగం బయటపడ్డాయి. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు. కాగా, గుప్త నిధుల తవ్వకాల్లో పురాతన కాలం నాటి విగ్రహాలు బయటపడి ఉంటాయా.? అక్రమార్కులు విగ్రహాలను తీసుకొచ్చి చెరువు నీళ్లలో వది లి వెళ్లారా..అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు..
రెండు వాహనాలు స్వాధీనం..
నలుగురిపై కేసు నమోదు
కరకగూడెం: మండలంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను కరకగూడెం పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. విశ్వ సనీ య సమాచారంతో మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాలను తనిఖీ చేయగా అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 11 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని పాల్వంచ గోశాలకు తరలించామని ఎస్‌ఐ పీవీఎన్‌రావు తెలిపారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం వదినేపల్లి గ్రామానికి చెందిన బానోతు మొగిలి, బానోతు శ్రీకాంత్, అంగోతు విజేందర్, కాసుమంచి శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
పేకాట స్థావరంపై దాడి
జూలూరుపాడు(సుజాతనగర్):మండలంలోని సర్వా రం గ్రామ పంచాయతీ పరిధి గోపాతండా శివారు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట స్థావరంపై సీసీఎస్, సుజాతనగర్ పోలీసులు శనివారం దాడి చేశారు. సు జాతనగర్ ఎస్‌ఐరమాదేవి కథనం ప్రకారం.. సర్వా రం గ్రామపంచాయతీ గోపాతండా శివారు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,100 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.


