మణుగూరుటౌన్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైతు సున్నం శ్రీను (43) మద్యానికి బానిసై ఇంట్లో ఖాళీగా ఉంటూ కూలీ పనులకు వెళ్లకుండా నిత్యం భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో కుటంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత జూలై 30న పురుగులమందు తాగాడు. కుటుంబీకులు మణుగూరు ఆస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉండగా, తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి హాట్‌స్పాట్‌లలో తనిఖీలు
పాల్వంచ: పట్టణంలోని గంజా యి హాట్‌స్పాట్‌లలో పోలీసులు తనిఖీ లు నిర్వహించారు. కాంట్రాక్టర్స్‌కాలనీ, పాతపాల్వంచ, సీతారాంపట్నం తదితర ప్రాంతాల్లో శనివారం తనిఖీలు చేపట్టారు. స్థానికులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. తనిఖీల్లో పట్టణ ఎస్‌ఐ టి.నాగరాజు, ఎస్‌ఐవిజయ, ఏఎస్ ఐ హరిబాబు, హెడ్ కానిస్టేబుల్ రఘురాంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలలో కలకలం..
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసి కొట్టాడనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్యా తమన్‌తేజ్‌ను తెలుగు ఉపాధ్యాయుడు రాజేందర్‌రెడ్డి చితకబాదినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాల యాజమాన్యం కూడా ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వివరణ కోసం టూటౌన్ పోలీసులను సంప్రదించగా స్పందించ లేదు.


