భద్రాచలంఅర్బన్: ఆస్పత్రిలో వైద్యుల పర్యవేణ ఎలా ఉంది? పేషంట్ల వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారా? అంటూ భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆరాతీశారు. శనివారం ఆయ న ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణులను ఓ వార్డులో ఉంచాలని, జ్వర పీడితలను ఎన్‌ఆర్సీ వార్డు ఎదురుగా ఉన్న 10 బెడ్ల వార్డులో ఉంచి మెరుగైన వైద్యం అందించాలని, నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉండాలని, రోగులతో పాటు వచ్చిన అటెండర్లు, ఆశా కార్యకర్తలకు వసతి కల్పించడంతో పాటు ఆహారం అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బందిని విధుల్లో ఉంచాలని అడినల్ డీఎంహెచ్‌ఓ సైదులుకు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరా తీసిన ఐటీడీఏ పీఓ రాహుల్


